పట్టణంలోని ఎస్ వి కన్వెన్షన్ హాల్లో శనివారం 'చంద్రమౌళీయం' గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 'నడిచే విజ్ఞానజ్యోతి' జ్యోతి చంద్రమౌళి అని బీరం సుందర రావు ప్రశంసించారు. మద్రాస్ తెలుగు యూనివర్సిటీ తెలుగు శాఖ డైరెక్టర్ విస్తాలి శంకర్రావు, ప్రొఫెసర్ వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ధర్మవరపు శ్రావణ్ కుమార్ సభాహ్వానం పలకగా, ఉబ్బా దేవపాలన సభకు అధ్యక్షత వహించారు. బీరం సుందర్రావు గ్రంథాన్ని సమీక్షించగా, సాహితీవేత్తలు దానిపై తమ అభిప్రాయాలు తెలిపారు. అనంతరం చంద్రమౌళి దంపతులను సాహితీవేత్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.