అద్దంకిలో బైక్ ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

1967చూసినవారు
అద్దంకిలో బైక్ ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు
అద్దంకి పట్టణంలోని రామ్‌నగర్ ప్రాంతంలో రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని బైక్‌పై వెళ్తున్న యువకుడు ఢీకొట్టడంతో నాగులపాడుకు చెందిన సంతోష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందిన వెంటనే స్థానికులు అతడిని 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.