అద్దంకి మండలం బొమ్మనంపాడు జగనన్న కాలనీ చిట్టడివిని తలపిస్తోందని, తుమ్మ చెట్లు పెరగడంతో కాలనీలోకి వెళ్లేందుకు వీలు లేకుండా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. YCP ప్రభుత్వం అద్దంకి పట్టణ పేదలకు బొమ్మనంపాడు లే అవుట్‌లో 955 మందికి నివేశన స్థలాలు మంజూరు చేసింది. అయితే, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం లేక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని, ఆ చెట్లను తొలగించి వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు.