చినగంజాం ఎంపీడీవో కారుకు ప్రమాదం

553చూసినవారు
చినగంజాం ఎంపీడీవో కారుకు ప్రమాదం
చినగంజాం ఎంపీడీవో కె. ధనలక్ష్మి ప్రయాణిస్తున్న కారు సోమవారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. ఒంగోలులోని  ఇంటికి ఎంపీడీవో, సీనియర్‌ అసిస్టెంట్ నిర్మల, టైపిస్ట్ బిందుతో కలిసి వెళ్తున్నారు. చదలవాడ గ్రామం దగ్గర కారులో సమస్య రావడంతో డ్రైవర్ దిగి చెక్ చేస్తుండగా వెనుక నుంచి మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు కాగా కారులో ఉన్న బిందుకు స్వల్ప గాయాలు అయ్యాయి. డ్రైవర్‌ను 108లో రిమ్స్‌కు తరలించగా ఈ ఘటనపై కేసు ననమోదైంది.

సంబంధిత పోస్ట్