అద్దంకిలో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రమైంది. పట్టణంలోని 10 పెట్రోల్ బంకుల్లో సోమవారం 4 బంకులు మూతపడ్డాయి. మిగిలిన 6 బంకుల్లో కేవలం 2 లీటర్ల పెట్రోల్ మాత్రమే అందిస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు బంకుల యజమానులు డీజిల్ నిల్వ చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.