యద్దనపూడి మండలం పూనూరు గ్రామంలో శుక్రవారం తెలగతోటి చిన్న అనే యువకుడు తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బతో మృతి చెందాడు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేసవిలో తరచుగా నీరు తాగుతూ, అవసరమైతేనే బయటకు రావాలని, గొడుగు, టోపీ వంటి రక్షణ వస్తువులు వాడాలని అధికారులు సూచిస్తున్నారు.