అద్దంకి: గుండ్లకమ్మ నదిలో వ్యక్తి గల్లంతు

1214చూసినవారు
అద్దంకి: గుండ్లకమ్మ నదిలో వ్యక్తి గల్లంతు
అద్దంకి మండలం వేలమురిపాడు వద్ద శుక్రవారం సాయంత్రం గుండ్లకమ్మ నదిలో ఈతకు వెళ్లి మధ్యప్రదేశ్ కు చెందిన ముఖేష్ కుమార్ అనే కూలీ గల్లంతయ్యాడు. బెంగళూరు హైవే రోడ్డు పనుల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న ముఖేష్ గల్లంతవ్వడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిఎస్ సుబ్బరాజు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్