పంగులూరు మండలం రామకూరు గ్రామంలో మంగళవారం మహమ్మద్ వలి అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఇంటి పనులు చేస్తుండగా, నీటి పైపును కిందకు అందిస్తున్నప్పుడు అది విద్యుత్ తీగకు తగలడంతో ఈ దుర్ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు అతన్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.