అద్దంకి మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉసురుపాటి శామ్యూల్ మాట్లాడుతూ, కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఉద్యోగ విరమణ వయసును 62కు పెంచాలని, 12వ పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.