అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించిన మంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.