అత్తను చంపిన అల్లుడు

4570చూసినవారు
అత్తను చంపిన అల్లుడు
సంతమాగులూరు మండలం ఏల్చూరులో శుక్రవారం అర్ధరాత్రి భార్యపై అనుమానంతో భార్య, అత్తపై కత్తితో దాడి చేసిన సంఘటనలో అత్త బ్రహ్మేశ్వరమ్మ (52) మృతి చెందగా, భార్య వీరనారాయణమ్మ (30) కొన ఊపిరితో ఉంది. దంపతులకు కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. కూతురుని తీసుకెళ్లేందుకు ఆమె తల్లి వచ్చింది. శుక్రవారం రాత్రి గొడవ జరగడంతో భర్త వసంతరాయుడు, అతని తమ్ముడు ఇద్దరిపై దాడి చేసి గొంతు కోశారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. వీరనారాయణమ్మను నరసరావుపేట ఆసుపత్రికి తరలించగా నిందితులు పరారీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్