పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అద్దంకి మండల వ్యాప్తంగా 1,220 మంది
విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 1,099 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో గురువారం వెల్లడించారు. మండల సగటున 90.08 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అద్దంకికి చెందిన యశ్వంత్ 597 మార్కులతో బాపట్ల జిల్లా టాపర్‌గా నిలిచాడు. పట్టణానికి చెందిన కావ్య, జోష్ణ 596 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.