బాపట్ల జిల్లాలో మత్తు పదార్థాల మూలాలను గుర్తించి, గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 398 కేసులు నమోదు చేసి, 61.370 కిలోల గంజాయిని, ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత నెలలో 3 కేసులు నమోదయ్యాయని, యువతను వ్యసనాలకు దూరం చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.