బాపట్ల మండలంలోని స్టువర్టుపురం పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఇంట్లోకి శనివారం తెల్లవారుజామున ఓ ఇసుక టిప్పర్ లారీ దూసుకువచ్చింది. ఇంటి ముందున్న వాహనాలను ఢీకొంటూ డివైడర్‌ను ఢీకొని లారీ ఆగింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.