బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం జాతీయ రహదారిపై శుక్రవారం రష్ కేఫ్ సమీపంలోని ఫ్లైఓవర్‌పై లారీ అదుపుతప్పి కింద పడింది. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.