వేటపాలెం మండలం తోటవారిపాలెం బైపాస్ రోడ్డులో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకల నుంచి తిరిగి వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న బచ్చులవారిపాలెం గ్రామానికి చెందిన అయ్యప్ప, రమణయ్య అనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది.