హత్య కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు

211చూసినవారు
హత్య కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు
బాపట్ల జిల్లా అడవులదీవి పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో నమోదైన హత్య కేసులో ఓ నిందితుడికి గుంటూరులోని IV అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 1,500 జరిమానా విధించింది. మహమ్మాదియపాలెంకు చెందిన 21 మంది నిందితులపై కేసు నమోదు కాగా, ఇప్పటికే 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మరో నిందితుడిపై విచారణ పూర్తికావడంతో శనివారం కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

సంబంధిత పోస్ట్