బాపట్ల పట్టణంలోని సుప్రసిద్ధ, చారిత్రాత్మక శ్రీ క్షీర భావనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో, శ్రీ సంపత్ గణపతి పరివార్ నిర్వాహకులు బాబూ నాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి పూట స్వామివారికి విశేష అర్చనలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఇందులో భాగంగా గణపతి విగ్రహం ముందు రకరకాల కూరగాయలను ఉంచి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామధేను పూజలు కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల అనంతరం పోలమ్మ భజన సమాజం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భక్తి గీతాల భజన కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.