బాపట్ల జిల్లా కర్లపాలెం హైవే ముకుంద టీ స్టాల్ వద్ద బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటో ధ్వంసం అయ్యి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ప్రమాదం అనుకోకుండా జరిగిందా లేక ఏదైనా వాహనం ఢీకొట్టిందా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు కర్లపాలెం పోలీసులకు సమాచారం అందించారు.