ఆటో బోల్తా… ఐదుగురికి గాయాలు

423చూసినవారు
ఆటో బోల్తా… ఐదుగురికి గాయాలు
బాపట్ల నుంచి జమ్ములపాలెం వైపు వెళ్తున్న ఆటో మంగళవారం మార్గమధ్యంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కాకుమానుకు చెందిన కె. వినోదిని కుడి కాలు విరగగా, మరో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్