బల్లికురవ: క్వారీలో లారీ దగ్ధం

3చూసినవారు
బల్లికురవ: క్వారీలో లారీ దగ్ధం
బల్లికురవ మండలంలోని గంగమ్మ గుడి సమీపంలో ఉన్న క్వారీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా లారీ దగ్ధమైంది. స్థానికులు వెంటనే స్పందించి నీటి ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే లారీ పూర్తిగా కాలిపోవడంతో భారీగా నష్టం వాటిల్లిందని లారీ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.