బాపట్ల జిల్లాలో ఏప్రిల్ 2025 - మార్చి 2026 మధ్య మద్యం అమ్మకాల సేల్ వాల్యూలో 1% స్వల్ప వృద్ధి నమోదైంది. గత 12 నెలల్లో రూ.844.34 కోట్ల విలువైన 11.65 లక్షల ఇండియన్ మేడ్ లిక్కర్(IML) బాక్సులు, 5.31 లక్షల బీరు బాక్సులు అమ్ముడవ్వగా, ఏప్రిల్ 2024 - మార్చి 2025 మధ్య ఈ గణాంకాలు 10.93 లక్షలు (IML బాక్సులు), బీరు బాక్సులు 2.82 లక్షలుగా, సేల్ వాల్యూ రూ.837.63 కోట్లుగా నమోదైంది.