అంతర్వేది తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బాపట్లకు చెందిన 18 మంది కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న వ్యాన్ శుక్రవారం కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెందుర్రు వద్ద జాతీయ రహదారి 216 సమీపంలో అదుపుతప్పి కల్వర్టును ఢీకొని బోదెలోకి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు చిన్నారులతో సహా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే మచిలీపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.