రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను కారు ఢీ కొట్టిన ఘటన ఆదివారం బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మధ్యాహ్నం రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటోను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు బోల్తా పడగా ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు భాగాలు ధ్వంసమయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.