బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని ఆమోదగిరిపట్నంలో చేనేత కార్మికుడు మోహన్‌రావు కుటుంబంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భార్య పార్వతి బుధవారం ఉదయం మృతి చెందింది. భార్య మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన మోహన్‌రావు, కొద్దిసేపటికే బాత్రూమ్‌లో కాలుజారి పడిపోవడంతో మృతిచెందాడు. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.