రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు దసరా కానుకగా కరువు భత్యం (డిఏ) ప్రకటించాలని ఎస్టియు బాపట్ల జిల్లా అధ్యక్షులు బడుగు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గుడివాడ అమరనాథ్ సంయుక్తంగా కోరారు. బాపట్ల జిల్లా ఎస్టియు కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ, 2024 నుండి ఇప్పటివరకు 4 డిఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పిఆర్సి బకాయిలు, డిఏ, తదితర బకాయిల విడుదలకు ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.