బాపట్ల జిల్లా వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒకరోజు ముందుగానే ప్రారంభమైంది. వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. సకాలంలో, పారదర్శకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా రాష్ట్ర స్థాయిలో పెన్షన్ పంపిణీలో రెండవ స్థానంలో నిలిచిందని జిల్లా సమాచార శాఖ అధికారులు తెలిపారు. ఈ విజయానికి సిబ్బంది సమన్వయం కారణమని అన్నారు.