అభివృద్ధిలో బాపట్ల జిల్లా టాప్‌లో ఉండాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న ప్రతి ఒక్క డెవలప్మెంట్ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉండాలన్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున మార్చిలోపు పనులన్నీ కంప్లీట్ చేయాలి అన్నారు.