బాపట్ల పట్టణ పశువైద్యశాలలో ఆదివారం ప్రపంచ రాబీస్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డా. వూరిబిండి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాబీస్ వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, తమ పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా యాంటిరబీస్ టీకా వేయించాలని సూచించారు. ప్రతి సంవత్సరం సుమారు 6000 మంది రాబీస్ తో మరణిస్తున్నారని, వీరిలో అధిక శాతం 15-20 ఏళ్ల యువకులేనని ఆయన పేర్కొన్నారు.