బాపట్ల: ఫ్లెక్సీ ల గోల... గ్రామాల్లో రగడ

319చూసినవారు
బాపట్ల: ఫ్లెక్సీ ల గోల... గ్రామాల్లో రగడ
బాపట్ల జిల్లా పిట్టలవాని పాలెం మండలంలో ఫ్లెక్సీల వివాదం ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీకి చెందిన ఎన్నికల ఫ్లెక్సీలను చించివేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు కర్లపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్