కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలో సగం కాలిన మృతదేహం కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు, గణపవరం పంచాయతీ పరిధిలోని దేవుడు మాన్యం గ్రామ పరిసర ప్రాంత పొలాల్లో సగం కాలిన మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతుడు గణపవరం గ్రామానికి చెందిన దాస్ గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.