బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ ఆమోదగిరి పట్నంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన మోహన్ రావుది చేనేత కుటుంబం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భార్య పార్వతి బుధవారం ఉదయం చనిపోయింది. కాసేపటికే భర్త మోహన్ రావు బాత్ రూములో కాలుజారడంతో చనిపోయారు.