బాపట్ల: దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడి లేడి అరెస్ట్

1112చూసినవారు
బహిరంగ ప్రదేశాల్లో జనసంచారం ఎక్కువగా ఉండే సమయాలను ఉపయోగించుకుని దొంగతనాలు చేస్తున్న ఒక మహిళను ఇంకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్ల పోలీస్ కార్యాలయంలో SP ఉమామహేశ్వర్ మంగళవారం ఈ వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన కావటి లలిత వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తోందని తెలిపారు. ఆమె వద్ద నుంచి సిబ్బంది 136 గ్రాముల బంగారం, సుమారు రూ.15 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈమెపై రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 17 కేసులు ఉన్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్