బాపట్ల పట్టణంలో బుధవారం కర్లపాలెం రహదారిలోని హీరో షోరూం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాపట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన బాధితుడు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నాడు. వ్యక్తిని గుర్తించిన వారు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.