శుక్రవారం కర్లపాలెం మండలం పెదపులుగువారిపాలెం వీఆర్ఏ నరేందర్ రెడ్డి, కర్లపాలెం తహసీల్దార్ కారును తుడిపించిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఉద్యోగితో ఇలా వ్యవహరించడంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది.