బాపట్ల పోలీసులు మంగళవారం ముగ్గురు దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. వీరు దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో 18 చోట్ల నేరాలకు పాల్పడినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. వీరి వద్ద నుంచి 137 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండి వస్తువులు, రూ.5 లక్షల నగదుతో సహా రూ.30,88,700 విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా మధ్యప్రదేశ్ కు చెందినదని గుర్తించారు.