బాపట్ల పట్టణంలోని సూర్యలంక బీచ్ అగ్రికల్చరల్ కాలేజ్ ప్రాంతంలో శనివారం, మహిళల భద్రతా పరిరక్షణ చర్యల్లో భాగంగా శక్తి యాప్ పై జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు శక్తి హెడ్‌క్వార్టర్ టీమ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఎస్ఐ అనిత ఆధ్వర్యంలో సిబ్బంది మహిళలకు శక్తి యాప్ డౌన్లోడ్ విధానం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, వెంటనే పోలీసుల సహాయం పొందే విధానంపై పూర్తి వివరాలు తెలియజేశారు.