లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బాపట్ల ఆర్ ఐ

204చూసినవారు
బాపట్ల మునిసిపాలిటీ రెవిన్యూ ఇన్స్పెక్టర్ షేక్ ఇమామ్, సూర్యలంక సమీపంలోని టీ స్టాల్ వద్ద సోమవారం రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చిన్నగంజాం కు చెందిన కుటుంబ సభ్యులు ఇంటి పనుల నిమిత్తం సంప్రదించగా ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ తెలిపారు. బాధితులు ఏసీబీని సంప్రదించగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే స్థానిక అధికారులకు తెలియజేయాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్