బాపట్ల జిల్లా కొత్త ఓడరేవు సముద్రతీరంలో రూ.200 కోట్లతో నిర్మించిన గోల్డెన్ శాండ్స్ బై ద బే రిసార్ట్ను చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. 10.75 ఎకరాల్లో 147 గదులతో నిర్మించిన ఈ రిసార్ట్ 750 మందికి ఉపాధి కల్పించనుంది. ల్యాన్, బ్యాంకెట్ హాలు, ప్రైవేటు బీచ్ యాక్సెస్ వంటి సదుపాయాలున్నాయి. యాగంటి ఎస్టేట్స్ ఛైర్మన్ యాగంటి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, 'బాపట్ల తీర ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్ ఏర్పాటు మా కల, అది ఈరోజు సాకారమైంది' అని తెలిపారు.