బాపట్ల: 'దర్జా లేని దర్జీలు'

223చూసినవారు
గ్రామాల్లో ఒకప్పుడు దర్జీలకు మంచి డిమాండ్ ఉండేది. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో బట్టలు కుట్టించుకునేందుకు ప్రజలు వారి దగ్గరకు వచ్చేవారు. కానీ ఇప్పుడు రెడీమేడ్ దుస్తుల వినియోగం పెరగడంతో దర్జీల పనులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. బాపట్లలోని దర్జీలను పలకరించగా.. రోజువారీ ఖర్చులు కూడా తీర్చుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూలీ పనులకు వెళ్తున్నామని చెప్తున్నారు.