బాపట్లలో శుక్రవారం, మద్యానికి బానిసై అల్లరచిల్లరగా తిరుగుతున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో రమేష్ రెడ్డి (35) అనే యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని ఏడో వార్డు ఉప్పరపాలేనికి చెందిన రమేష్ రెడ్డి, మద్యం తాగొద్దని చెప్పినా వినిపించుకోకుండా తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.