బైక్ ఢీకొని ఇద్దరు వ్యక్తులకు గాయాలు.. అపస్మారక స్థితిలో బైకర్

2214చూసినవారు
బైక్ ఢీకొని ఇద్దరు వ్యక్తులకు గాయాలు.. అపస్మారక స్థితిలో బైకర్
బాపట్ల మండలం నందిరాజు తోట సమీపంలో ఆదివారం రాత్రి హైవేపై అతివేగంగా దూసుకువచ్చిన ఓ ద్విచక్ర వాహనం ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తితో పాటు, ఢీకొన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి క్షతగాత్రులను బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్