బల్లికురవ మండలం చిన్న జమ్మలమడకలో మంగళవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పరిమి యేసయ్య, శిరీష దంపతుల మూడేళ్ల కుమారుడు రెడీ పాల్ రోడ్డుపై ఆడుకుంటుండగా, ప్రమాదవశాత్తు లారీ టైర్ కింద పడి మృతి చెందాడు. ఈ ఘటనతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ వార్త స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.