కర్లపాలెం మండలంలోని పేరలిపాడు గ్రామంలో శనివారం జరిగిన సాంఘిక నాటక ప్రదర్శనలో విషాదం చోటుచేసుకుంది. స్టేజి కింద నుంచి వెళ్తున్న జోగి లిబ్నిరాజు అనే బాలుడికి విద్యుత్ వైర్లు తగలడంతో కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. స్థానికులు అతన్ని వెంటనే వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.