బుధవారం చెరుకుపల్లి మండలం కుంచాలవారి పాలెంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన చెత్త తగలబెడుతుండగా మంటలు వ్యాపించి పిట్టు కృష్ణారెడ్డికి చెందిన పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 60 వేల నగదు, 7 సవర్ల బంగారం, 14 తులాల వెండి కాలిపోయాయి. మంటలు పక్కనున్న డాబాకు కూడా వ్యాపించాయి. పొన్నూరు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు.