సీఎం చంద్రబాబు సూరేపల్లి పర్యటన నేపథ్యంలో బాపట్ల జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. ఈ నెల 9న ఉదయం 6 గంటల నుంచే ఆంక్షలు అమల్లోకి వస్తాయని DSP శ్రీనివాసరావు తెలిపారు. వేమవరం జంక్షన్ నుంచి రేపల్లె వైపు వచ్చే వాహనాలను హైవే మీదుగా, పల్లెకోన-కోనేటిపురం మార్గంలోని వాహనాలను జిల్లేపల్లి–పెద్దవరం మీదుగా NH–216Aలోకి మళ్లించనున్నారు. వాహనదారులు ఈ మార్పులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.