వేటపాలెం విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసలు

3225చూసినవారు
వేటపాలెం విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసలు
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బాపట్ల పర్యాటకశాఖ సూర్యలంక బీచ్ నందు ఆదివారం వివిధ పోటీలు నిర్వహించింది. వేటపాలెం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు అహమ్మద్ భాషా, శ్రీకా పాటల పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వీరికి బహుమతులు అందజేసి ప్రశంసించారు. పాఠశాల హెచ్ఎం డి. సరోజిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

సంబంధిత పోస్ట్