వేటపాలెం మండలం రావూరుపేటలో మాజేటి ప్రభాకర్ (33), పార్వతి (24) అనే దంపతులు బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ముందుగా తమ 13 నెలల కుమార్తె మాన్వితను పొరుగింటి వారికి అప్పగించి, ఆ తర్వాత ఇంట్లో ఉరేసుకున్నారు. బంధువులు ఇంటికి వచ్చి చూసేసరికి ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.