తుఫాన్.. బాపట్ల జిల్లాకు ఎల్లో అలర్ట్

5చూసినవారు
తుఫాన్.. బాపట్ల జిల్లాకు ఎల్లో అలర్ట్
దిత్వా తుఫాన్ నేపథ్యంలో, బాపట్ల జిల్లాకు వాతావరణ శాఖ బుధవారం ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. కలెక్టరేట్ కార్యాలయం విడుదల చేసిన మ్యాప్ ప్రకారం, రానున్న 3 గంటల్లో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కార్యాలయం సూచించింది.

సంబంధిత పోస్ట్