వేసవిలో బాపట్ల జిల్లా సముద్ర తీరాలకు వచ్చే యాత్రికులకు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ మంగళవారం పలు కీలక సూచనలు చేశారు. సముద్రంలో లోతుగా వెళ్లరాదని, మద్యం సేవించి సముద్రంలోకి దిగరాదని, పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే వెళ్లాలని సూచించారు. ఇతరులను ఇబ్బంది పెట్టినా, అసభ్యంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.